మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 15
ఉత్తమ సొసైటీ చైర్మన్ గా మణుగూరు సొసైటి చైర్మన్ గా కుర్రి.నాగేశ్వరరావు ఎంపికయ్యారు.స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు కు బెస్ట్ సొసైటీ చైర్మన్ అవార్డ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ వినీత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు,అధికారులు,బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.