మన్యం న్యూస్ వాజేడు.
మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, ఎం ఈఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్,లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 నూతన వాహనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.తొలుత తహసిల్దార్ శ్రీనివాస్,మండల పరిషత్ అభివృద్ధి అధికారిని విజయ 108 వాహనాన్ని ప్రారంభించారు. ఎంపీపీ ఎస్ నాగారం పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు భరతమాత నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద, జడ్పిటిసి పుష్పలత, తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని విజయ, డిప్యూటీ తహాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ, ఆర్ ఐ కీసరి రాజు, వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాజీ బోదెబోయిన బుచ్చయ్య, మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.