మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 15: మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఉదయం ప్రభుత్వ ప్రవేటు కార్యాలయాల్లో, రాజకీయపక్షాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు
జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ….నాటితరం నాయకుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలన్నారు. నాటి ఉద్యమకారుల ఆశయాలను మనం కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు సాజియా సుల్తానా, రేవతి, రవి, బానోత్ పార్వతి, దారా వెంకటేశ్వరరావు,ఉప్పతల ఏడుకొండలు, నరుకుళ్ల సత్యనారాయణ, గాదె లింగయ్య, నల్లమోతు వెంకటనారాయణ, సూర వెంకటేశ్వరరావు, కొణకండ్ల వెంకటరెడ్డి, సయ్యద్ రసూల్, గాదె శివప్రసాద్, భూపతి శ్రీనివాసరావు, సత్తి. నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, లంకా విజయలక్ష్మి, భూక్య రాజీ, వంకాయలపాటి బాబురావు, వారాది సత్యనారాయణ, గఫార్మియా, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.