మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సొసైటీ చైర్మన్ బిక్కసానీ శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర్యమే నేటి రైతు రాజ్యం అని అన్నారు,ఎందరో అమరవీరుల త్యాగాల పోరాటల ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్ర్యం అని,దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోరాటయోధుల సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, రైతులు,ప్రజలు పాల్గొన్నారు.