మన్యం న్యూస్ చర్ల:
77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలోని బి ఎస్ ఆర్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సోయం రాజారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోయం రాజారావు మాట్లాడుతు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావులు త్యాగాలను స్మరించుకుంటు స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనకోసం ప్రతీ ఒక్కరు పునరంకితం కావాలని అన్నారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులను ఎప్పుడు స్మరించుకుంటూ దేశ రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవుతూ ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఆత్మ కమిటీ చైర్మన్ పోలిన రామచంద్రరావు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు,సహయ కార్యదర్శి ఆలం ఈశ్వర్, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు కాకి అనిల్, నేర్రబోయిన చంద్రశేఖర్, ఆర్ కొత్తగూడెం మాజీ సర్పంచ్ తుర్రం రవి, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, తడికల లాలయ్య, అజీజ్, ఎర్రవుల ప్రేమ, గంపల రమేష్, సిద్ది సంతోష్, తోటమల్ల సందీప్, రావుల సతిష్, మచ్చ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.