మన్యం న్యూస్, బూర్గంపాడు:
మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రి సూపరడెంట్ నవీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల పోరాటల ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్ర్యం అని,దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి బ్రిటిష్ పాలకుల సంకెళ్ల నుండి విముక్తి కలిగిన రోజని, స్వాతంత్ర్య దినోత్సవం యావత్తు దేశానికి గొప్ప పండుగ రోజు అని అన్నారు.
