UPDATES  

 సొంతగూటికి డా. తెల్లం వెంకట్రావు..

  • సొంతగూటికి డా. తెల్లం వెంకట్రావు..
  • అనుచర వర్గానికి ఇప్పటికే అందిన సమాచారం
  • భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కి ఏర్పాట్లు
  • నేడు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక..
  • జిల్లాలో పొంగులేటి కి షాక్..
  • తెల్లం కు భద్రాచలం టికెట్ హామీ..

మన్యం, న్యూస్ దుమ్ముగూడెం::
తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు వైద్యుడు, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా సుపరచితమైన వ్యక్తి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా 2014 మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో టిఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జిగా ఎన్నికై 2018 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఓటమి గల కారణాలను తెలుసుకొని రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ప్రజాక్షేత్రం వైపు ముందుకు సాగారు .ఈ తరుణంలో రాజకీయ గురువు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తను కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. 2023 ఎన్నికలు దగ్గర పడడంతో భద్రాచలం ఎమ్మెల్యే సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పోదాం వీరయ్యకు అధిష్టానం మొగ్గుచూపుడంతో పరేషాన్ చెందిన తెల్లం పొంగులేటికి తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్వే ఆధారంగా టికెట్ కేటాయిస్తుందని కొద్దికాలం వేచి చూస్తే పార్టీలో మంచి స్థానం లభిస్తుందని చెప్పడంతో పొంగులేటి వ్యాఖ్యలకు సముఖంగా లేని వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే బిఆర్ఎస్ నాయకులు తనతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు.
పొంగులేటి కి షాక్
ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ నాయకుల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపధం చేసిన పొంగులేటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం జిల్లాలో పొంగులేటి అనుచరులని తమ వైపుకు తిప్పుకునేందుకు జిల్లా మంత్రి పువ్వాడ హరీష్ రావు ను కేసీఆర్ రంగంలోకి దించారు .ఈ చర్చల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అసంతృప్తిగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావుకు బి.ఆర్.ఎస్ నాయకులు గాళం వేశారు. భద్రాద్రి జిల్లాలో పొంగులేటి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి తెల్లం, కోరం కనుకయ్యలకు జిల్లా మంత్రి పువ్వాడ, అధ్యక్షులు రేగ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని వారితో మంత్రాలు జరిపి బిఆర్ఎస్ లో చేరేందుకు ఒప్పించారు. తెల్లం వెంకట్రావుకు భద్రాచలం టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. పొంగులేటి కి జిల్లాలో క్యాడర్ లేకుండా బిఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
నేడే కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
భద్రాచలం సీటు ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ సరైన అభ్యర్థి కోసం వేచి చూస్తున్నారు ఈ క్రమంలోనే సర్వేల ఆధారంగా నియోజవర్గంలో గత పర్యంలో ఓడిపోయి సానుభూతి కూడబెట్టుకున్న తెల్లం వెంకట్రావు వైపు అధిష్టానం మొగ్గుచూపింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి తెల్లంని బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసి సఫలమైంది. బుధవారం భద్రాచలం నుంచి భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ చేరిన తెల్లం వెంకట్రావు కేసీఆర్ తో చర్చలు జరిపారు. అనంతరం నేడు వారి కుటుంబ సభ్యులు జిల్లా మంత్రి,బి. ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసానిఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బిఆర్ఎస్ లోకి పునరాగమనం చేయనున్నారు.
కార్యకర్తలే నా బలం డాక్టర్ తెల్లం వెంకట్రావు…
కార్యకర్తలే నా బలమని వారి కోరిక మేరకే తిరిగి బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నానని భద్రాచలం మాజీ నియోజకవర్గ అధ్యక్షులు తెల్లం వెంకట్రావు తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తల్లో సంతృప్తి లేదని కాబట్టే వారి నిర్ణయం మేరకు మళ్ళీ పార్టీలో చేరుతున్నానని తనని మరల పార్టీలో చేర్చుకునేందుకు నిర్ణయించుకున్నటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతూ నేడు వారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !