UPDATES  

 కుష్టి వ్యాధిగ్రస్తులు గుర్తింపు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 16::
కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్ల తో ఇంటింటికి తిరిగి కుష్టి వ్యాధి గుర్తింపు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వ్యాధి నివారణ గురించి తెలుపుతూ శరీరం మీద స్పర్శ లేక చర్మం రాగి రంగు లేత గోధుమ రంగు మచ్చలు ఉన్నట్లయితే వ్యాధి నిర్ధారణ చేయించి ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు. కుష్టి వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని అన్నారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య పరిధి కొత్తపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమ తెరలను వాడుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దుర్గ, ధర్మయ్య, సూపర్వైజర్ సాగర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !