మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుండి 22వ తేదీ వరకు నిర్వహించే ఆరు రోజుల తృతీయ సోపాన్ క్యాంప్ ను గురువారం చిల్డ్రన్స్ పార్క్ ఉన్న సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఏజిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ కమిషనర్ శ్రీనివాసరావు హాజరై భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో విద్యార్థులను చిన్నతనం నుండే దేశభక్తి క్రణశిక్షణ సేవా భావం నాయకత్వ లక్షణాలు మొత్తంగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అలవరచుకునేలా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం దోహద పడుతుందని పేర్కొన్నారు. అందుకే యువతను మరింతగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని ఇందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ శిక్షణ క్యాంప్ నందు నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించి గవర్నర్ రాష్ట్రపతి అవార్డులను గెలుచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి ఎయిడెడ్ పాఠశాల ఇల్లందు, శారదా విద్యాలయం, త్రివేణి స్కూల్, మాస్టర్ ఈకే విద్యాలయం స్కౌట్స్ స్టూడెంట్స్, స్కౌట్ మాస్టర్స్, రోవర్ స్కౌట్ లీడర్స్ రోవర్సు పాల్గొన్నారు.
