మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
నర్సరీ దారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు.
గురువారం ఇల్లందు, టేకులపల్లి, పాల్వంచ, సుజాతనగర్, జూలురుపాడు తదితర మండలాల్లో మిరప కూరగాయల నర్సరీలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న తనిఖీచేసి నర్సరీదారులకు పలు సూచనలు సాంకేతిక సలహాలు తెలియజేశారు. నర్సరీ దారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు.
మిరప రకాలను, కూరగాయ రకాలను, బంతిపూలను, ఇతర ఉద్యాన పంటల నారును నర్సరీ చట్టం ప్రకారం పెంచాలని తెలిపారు. నర్సరీ దారులు ఎప్పటి కప్పుడు మేలైన యాజమాన్య పద్ధతులు ప్రమాణాలు ఆచరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో
పలువురు నర్సరీదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.