మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
గడచిన ఆర్థిక సంవత్సరం 2020-21, 2021-22 కి సంబందించిన కాంట్రాక్ట్ కార్మికుల బొగ్గు గని భవిష్యనిధి పాసు పుస్తకములను జనరల్ మేనేజర్ సివిల్ సూచనల మేరకు డివైజియం(సివిల్)పి.రాజశేఖర్, డివైయస్ఇ(సివిల్)ఎ.రవి కుమార్ ఆద్వర్యంలో గురువారం కొత్తగూడెం కార్పొరేట్ సివిల్ డిపార్ట్మెంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల సూపర్ వైజర్లకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భముగా డివైజియం సివిల్ రాజశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులందరూ రక్షణ సూత్రాలను పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. నాగాలు చేయకుండా డ్యూటీలు చేస్తూ కుటుంబాలకు అండగా నిలవాలి అన్నారు. డ్యూటీలు సక్రమంగా చేస్తే వచ్చే జీతాన్ని బట్టి సి.యం.పి.ఎఫ్ రికవరీ ఉంటుందని అది వారి భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో జే.ఇ.(సివిల్) కరుణాకర్ రెడ్డి, రమణ మూర్తి, ఎ.వి.రమేష్, యం.యస్.ఆర్.మూర్తి, ఇతర సిబ్బంది, కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.