మంత్రి కేటీఆర్ సమక్షంలో బీ.ఆర్.ఎస్ లో జాయిన్ అయిన కామ్రేడ్ బోళ్ళ వినోద్, కూర సుజాత
*సిపిఎం కి ఎదురు దెబ్బ
మన్యం న్యూస్ చర్ల;
చర్ల మండలంకు చెందిన సిపిఎం మండల నాయకుడు, కెవిపిఎస్ మండల సభ్యుడు బోళ్ల వినోద్ గురువారం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ భవనం లోని మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడానికి బోళ్ళకృషి కూడా ఎంతగానో ఉందని చెప్పుకోవచ్చు. బోళ్ల వినోద్ తండ్రి కామ్రేడ్ బోళ్ల వెంకటేశ్వర్లు కరుడ గట్టిన సిపిఎం పార్టీ వాది. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కు ఎంతో ఆప్తుడు. వాళ్ల నాన్నగారి అడుగుజాడల్లోని ఇన్ని సంవత్సరాలు సిపిఎం జెండాను మోస్తూ పార్టీలో బలమైన క్యాడర్ ను ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం పరిధిలోనీ చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడు. వినోదు బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున యువత బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా చర్ల మండలలోని సిపిఎం పార్టీ నుంచి గెలిచిన 15 వ వార్డు మెంబర్ కూర సుజాత బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ బాలసాని లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు రాజారావు, కాపుల నాగరాజు, కాకి అనిల్, ఆలం ఈశ్వర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
