మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ పథకం కోసం లబ్దిదారుల ధరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన
త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. గురువారం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి, తుంగారం గ్రామాల్లో ఆమె పర్యటించారు. ధరఖాస్తుల పరిశీలనపై పలు సూచనలు, సలహాలు మండల అధికారులకు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు తూచ తప్పకుండా wపాటించాలని, స్వంత స్థలం, రేషన్ కార్డు ఉన్నవారి ధరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్లాబ్ ఇల్లు ఉంటే అట్టి ధరఖాస్తులను తిరస్కరించాలన్నారు. మండలంలోని 14 పంచాయతీల్లో 3323 ధరఖాస్తులను శుక్రవారం (18తేది) నాటికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆమె వెంట ఎంపిడిఓ రేవతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాణి, జిపి సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది,పాల్గొన్నారు.