UPDATES  

 పోలీస్ క్వార్టర్స్ లో డేంజరస్ బెల్స్

పోలీస్ క్వార్టర్స్ లో డేంజరస్ బెల్స్
*దినదిన ఘనంగా గడుపుతున్న పోలీస్ సిబ్బంది,కుటుంబ సభ్యులు
*మరమ్మతులు నిర్వహించాలని వేడుకోలు
మన్యం న్యూస్, నూగురు వెంకటాపురం:రక్షణ భటులు అంటే రక్షించేవారు. తమ ప్రాణాలని సైతం అడ్డుపెట్టి ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తారు. అలాంటి రక్షక భటులకు కష్టాలు వచ్చాయి. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్లి కాసేపు సేదతీరుదాము అనుకుంటేనే వారికి భయం వెంటాడు. శిథిలావస్థలో ఉన్న గృహాలతో దిన, దిన గండం గా గడుపుతున్నారు.మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న పోలీస్ కోటర్స్ శిధిలావస్థకు చేరుకున్నాయి.
ఏళ్ల తరబడి అవి సంవత్సరానికి కొంచెం కూలిపోతూ, కోటర్స్ లో ఉన్న పోలీస్ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఎన్ని ఏళ్లయినా
పోలీస్ క్వార్టర్స్ ను పట్టించుకునే నాధుడే లేకపోవడం వాళ్ల గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి.
వర్షం పడితే క్వార్టర్స్ పైనుంచి నీళ్లు లోనకారి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన సొంత క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో పోలీస్ సిబ్బంది భయభ్రాంతులకుగురి చేస్తోంది.
పోలీస్ క్వార్టర్స్ గోడల పెచ్చులు సైతం రాలి కింద పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పోలీస్ క్వార్టర్లలో జీవించే పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యు లు దినదిన గండంగా గడుపుతున్నారు.
అలాగే పాత గోడలు అవ్వడంతో చెట్లు చేమలు మొలిచి పాములు తేళ్ల సంచారం ఉంటుందని తెలిపారు .పోలీసు కుటుంబాలకు క్వార్టర్స్ గోడలో నుంచి పాములు తేళ్ల కాటు భారిన పడి మృతిచెందితే దానికి బాధ్యులు ఎవరు?అని వారు ప్రశ్నిస్తున్నారు.
పాత క్వార్టర్స్ ను కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని వారు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !