UPDATES  

 బీ. ఆర్.ఎస్ లో జోరుగా చేరికలు

బీ. ఆర్.ఎస్ లో జోరుగా చేరికలు
పోలారం గ్రామపంచాయతీ న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన 70 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరిక *కేసీఆర్ నాయకత్వంలో జెట్ స్పీడ్ తో తెలంగాణ అభివృద్ధి
* పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దు
ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు: మండల పరిధి పోలారం గ్రామపంచాయతీకి చెందిన 70 కుటుంబాలు న్యూడెమోక్రసీ పార్టీ నుండి అధికార బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సమక్షంలో గురువారం చేరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. పోలారంలోని న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా పార్టీలో చేరారని అన్నారు. పోలారం గ్రామానికి సిసిరోడ్లను వేసి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు. నాడు నరకయాతనగా ఉన్న రోడ్లను మండల కేంద్రం నుండి పోలారానికి ప్రయాణ, రవాణాకష్టాలు లేకుండా రోడ్లు వేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నేడు గ్రామీణ రహదారులకు మోక్షం కలిగిందన్నారు. పొలారం గ్రామంలో రూ. 2.20 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చెయ్యడం జరిగిందని తెలిపారు. అభివృద్ది జరిగి ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో వివిధ పార్టీల నాయకులు రకరకాల వేషాలు వేసుకొని గ్రామాలలోకి ఇప్పుడు వస్తారని కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చులు పెట్టడానికి కులాలు, మతాల పేర్లతో వస్తారని.. అభివృద్ధి మా కులమని, సంక్షేమమే మా మతమని వారికి తిప్పుకొట్టే విధంగా సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలంరమేష్, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, సొసైటీ డైరెక్టర్ లస్కర్, మండల కోఆప్షన్ గాజి, మండల ఉపాధ్యక్షురాలు మాలోత్ కవిత, మండల నాయకులు మల్సూర్, డేరంగుల పోశం, నీలం రాజశేఖర్, గ్రామశాఖ అధ్యక్షులు రంగన్న, రాజేష్, రాజశేఖర్, సుధాకర్, నాగేశ్వరరావు, బాలు, నాగేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !