*మళ్లీ కారే… మళ్ళీ సారే
* రేగా హ్యాట్రిక్ పక్క*
సంక్షేమ సారధి వెంటే పినపాక నియోజకవర్గ ప్రజలు
*అభివృద్ధి ప్రదాతకు మెజారిటీ ప్రజల మద్దతు
*రేగా కు దరిదాపుల్లో లేని ప్రతిపక్షాలు
*గెలిస్తే నెక్స్ట్ మంత్రి అంటున్న అనుచర గణం
మన్యం న్యూస్, గుండాల: మళ్లీ కారే… మళ్ళీ సారే.రేగా కు దారిదాపుల్లో లేని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. ఒకవైపు ఎవరు ఊహించని అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ మంత్రం వెరసి రేగా కు హ్యాట్రిక్ పక్క. నెక్స్ట్ మంత్రి అంటూ అనుచర గణంలో పూర్తి విశ్వాసం.మన్యం న్యూస్ ప్రత్యేక కథనం. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు హ్యాట్రిక్ విజయం పక్క అంటూ పినపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యర్ధులు ఎవరు తన దరిదాపుల్లో లేకపోవడంతో సునాయాస విజయం రేగాకు దక్కనుందని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కోనసాగుతుంది.పినపాక నియోజకవర్గా వ్యాప్తంగా పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు,ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం మండలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జెట్ స్పీడ్ తో దూసుకపోతుంది.దీనితో రేగా కాంతారావుకు ప్రజలలో గతంలో కంటే ఎక్కువ క్రేజ్ పెరిగింది. ఎక్కడ చూసిన అభివృద్ధితో నియోజకవర్గ దూసుకుపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగానే రేగా కాంతారావు వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో ఏ నాయకుడికి లేనంత ఆదరణ రేగా కాంతారావుకు పెరిగింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కరోనా సంక్షోభం వచ్చిన దాని నుండి కోరుకున్న తర్వాత నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధిలో నియోజకవర్గ పెద్ద ముందడుగు సాధించడంతో ప్రజలలో సైతం ఆయనపై పెద్ద ఎత్తున క్రేజ్ ఏర్పడింది. సంక్షేమ సారధి వెంటే ఉండాలంటూ ప్రజలు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి విప్ రేగా కాంతారావుకు మద్దతు పలుకుతున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాలలో నీ అన్ని గ్రామాలలో రేగా కాంతారావు పెద్ద ఎత్తున ఆదరణ పెరగడంతో ప్రత్యర్థి గుండెల్లో గుభులు మొదలైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన రేగ కాంతారావుకు భారీ విజయం దక్కుతుందనిసమాచారం.గెలుపు దేవుడెరుగు. రేగా మెజార్టీ నైన తగ్గించాలని పనితో కొంత తప్పుడు ఆరోపణలను చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ నియోజకవర్గ ప్రజలు రేగా కాంతారావుకు పట్టం కట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారని తెలుసుకున్న ప్రత్యర్థి వర్గం ఏమి చేయాలో అర్థం కాక నిస్సాయస్థితిలోకి వెళ్లినట్లు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాతకు అండగా నిలిచి అఖండ మెజార్టీ కట్టబెట్టడంతో నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి ఎవరెస్టు శిఖరం అంత ఎదిగే అవకాశం ఉందని పినపాక నియోజకవర్గ ప్రజల భావన. రేగా కాంతారావుకు భారీ మెజార్టీతో గెలిపించడమె తమ ప్రధాన కర్తవ్యం అని పినపాక నియోజకవర్గ శ్రేణులు, రేగా వీరాభిమానులు సిద్ధంగా ఉన్నారు.
