గ్రామగ్రామాన యూత్ కాంగ్రెస్ ఆత్మీయ సమావేశాలు
*మద్దతు తెలిపిన ఉప్పుసాక సర్పంచ్ పాయం
మన్యం న్యూస్,బూర్గంపాడు :
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అదేశాలమేరకురానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపేలక్ష్యంగా గ్రామగ్రామాన యూత్ కాంగ్రెస్ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నిమ్మల హరీష్ యాదవ్ తెలిపారు. బుధవారం మండలం లో యూత్ కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం గా ఉప్పసాక పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు సహకారంతో స్థానిక యువజన కాంగ్రెస్ సైనికులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా యువత విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు,యువత తదితరులు పాల్గొన్నారు.
