మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు టౌన్, కామేపల్లి, టేకులపల్లి మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీబందు చెక్కులను ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ చేతులమీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడు..ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ డీవీ, వైస్ చైర్మన్, 24వార్డుల కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ హాజరవుతారని తెలిపారు. బీ. ఆర్. ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీ, మహిళా కమిటీ, యూత్ కమిటీ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని శ్రీనివాసరెడ్డి కోరారు.
