మన్యం న్యూస్, అశ్వపురం:బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని అమెర్ద గ్రామ పంచాయతికి చెందిన నేలపట్ల మాధవరెడ్డి కి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 60,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది.పేదల ఆరోగ్యం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి,మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మైనారిటీ అధ్యక్షులు షేక్ నయీమ్,అమెర్ద గ్రామ శాఖ అధ్యక్షులు ఇరుగు నర్సయ్య,అశ్వపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపల్లి కిరణ్,యువజన నాయకులు నజీర్ సోను,మోదుగు వంశీ,జెన్నీ రాజశేఖర్,కాలవ సంసోన్,ఇరుగు నాగరాజు,కరకపల్లి డేవిడ్,మేకల భాస్కర్,మడిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.