మన్యం న్యూస్, దుమ్ముగూడెం,ఆగస్టు 16::
దుమ్ముగూడెం మండలంలో ఇటీవల గోదావరి వరదలకు సమర్థవంతంగా ఎదుర్కొని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, వరదలు అనంతరం పారిశుద్ధ్య పనుల్లో విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేసిన మండల పంచాయతీ అధికారి ఇన్చార్జి ఎంపీడీవో ముత్యాలరావుకు స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందించారు. ఉత్తమ అవార్డు అందుకున్న ముత్యాలరావు బుధవారం కలెక్టర్ ప్రియాంక అలా అభినందనలు తెలియజేశారు.