మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
త్వరలో జరగనున్న “గడప గడపకు గడల” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం డాక్టర్ జి.యస్.ఆర్. ట్రస్ట్ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కల్పించారు. చుంచుపల్లి గ్రామ పంచాయితీ చెందిన ట్రస్ట్ సభ్యులు మలోత్ శివనాయక్ ఆధ్వర్యంలో గడప గడపకు గడల మీ కొడుకుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రచారం చేస్తూ విద్యా వైద్యం ఉపాధి వంటి అవసరాలను ప్రతి ఒక్కరూ డాక్టర్ జి.యస్.ఆర్. ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు, మేనేజర్ చంద్రగిరి అంజి, ఆరెల్లి శ్రీనివాస్, చుంచుపల్లి గ్రామస్తులు వాలి, రుక్మిణి, వెంకన్న, సునీత,రాంబాయి, రమేష్, మంజుల, విజయ, శ్రీను, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.