UPDATES  

 ఇసుక క్వారీ బినామీ వ్యవస్థపై సిబిసిఐడితో విచారణ జరిపించాలి. …… జీ యస్ పి రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ

 

మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలైన భద్రాచలం నుండి వాజేడు వరకు బూర్గంపాడు నుండి ఏటూరి నాగారం వరకు కొనసాగుతున్న బినామీ ఇసుక క్వారీలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.షెడ్యూల్ ప్రాంతం పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించిన ఇసుక క్వారీలను రద్దు చేయాలని కోరుతున్నాము. ఏజెన్సీలో బినామీ కాంట్రాక్టర్లు ప్రవేశించి స్థానిక రాజకీయ పార్టీలను లోబర్చుకొని అమాయక ఆదివాసీలను గ్రామాలలో గ్రూపులుగా విభజించి వారికి అనుకూలంగా ఉన్న ఆదివాసీలకు పదో పరక ఇచ్చి ప్రలోభపర్సి కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా ఆదివాసులను మలుచుకొని మరియు రెవెన్యూ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి పెసా గ్రామసభలు తూతూ మంత్రంగా తీర్మానాలు చేయిస్తున్నారు.భద్రాచలం నుండి వాజేడు వరకు బూర్గంపాడు నుండి ఏటూరు నాగారం వరకు కొనసాగుతున్న ఇసుక క్వారీలన్ని బినామీలే నడిపిస్తున్నారు.ఇలా సుమారు 1000కోట్ల ఇసుక వ్యాపారం కొనసాగుతుందని ఆరోపించారు.
కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు ఆర్థించడం కోసం గోదావరి గర్భంలో భారీ యంత్రాలతో ఇసుకను తోడుతున్నారు దీని వలన గోదావరి గర్భంలో భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉంది పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది
పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఇసుక వనరు ద్వారా ఆదాయాన్ని ఆదివాసీల అభివృద్ధికై ఖర్చు పెట్టాలి ఇక్కడ ఇసుక మాఫియా ప్రవేశించడం వలన ఈ పదేళ్ల కాలంలో ఎక్కడా కూడా లెక్కలు కనబడటం లేదు గ్రామాల్లో కూలీలకు వేతనాలు సరి పడ ఇవ్వడం లేదు గ్రామసభ చట్టాన్ని ఇసుక మాఫియా రాజకీయ దళారులు ఈ యొక్క చట్టాన్ని అపహస్యం చేస్తున్నారు. దీనిపై సిబి సిఐడితో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఇసుక మాఫియా వ్యవస్థను అరికట్టేందుకు ఐ టి డి ఏ స్థాయిలో సలహా కమిటీలు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని గోదావరిలో పట్టాలు పేరిట అనేక చోట్ల గోదావరి గర్భంలో కూడా ఇసుకను తోడేస్తున్నారు ఐటిడిఏలు చొరవ తీసుకొని ఇసుక తవ్వకాలను కూడా గుర్తించేందుకు వీడియో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గోదావరి గర్భం నుండి తోడిన ఇసుకను మార్కెట్ రేటు కు అమ్మి గ్రామ సభ్యుల అకౌంట్లో నగదు జమ చేయాలి ఇసుక బినామీ వ్యవస్థను పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !