పేదలకు వరం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు…
*బీ.ఆర్.ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు.
మన్యం న్యూస్ ,చండ్రుగొండ, ఆగస్టు 16: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదలకు వరంలాంటిదని బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాదక్షులు, జాతీయ బిసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాదక్షులు భూపతి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రావికంపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ద్వారా వచ్చిన సిఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్దిదారులు కాకటీ రాములమ్మ, షేక్ బాజి, నల్లగట్ల కొండల్, అజ్మీర సునీతలకు ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి పేదవానికి వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో సిఎం రిలీప్ఫండ్ చెక్కులు అందజేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
