డైరెక్టర్ సంపత్ నంది( Sampath nandi ) ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం ఈయన సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) తో సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా మీదనే ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు.
నిజానికి సంపత్ నంది తీసిన గౌతమ్ నంద సినిమా ఒక మంచి సినిమా అనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ వే లో సాగే సినిమా కావడం.తో జనాలకి కొంత వరకు బాగానే నచ్చింది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది….దీనితో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో ఈయన చేస్తున్న సినిమా స్టోరీ ఎలాంటిది అనే దానిమీద చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి…ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా స్టోరీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ గా తెలుస్తుంది…రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఎలా అయితే కనిపించాడో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా అలానే కనిపిస్తాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి…మరి ఈ మూవీ మీద వచ్చే వార్తలు ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది…
అయితే సంపత్ నంది రామ్ చరణ్ ( Ram Charan )తో చేసిన రచ్చ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత రవితేజ తో చేసిన బెంగాల్ టైగర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది…ఇక దానికి తోడు ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడుతున్నాయి. అయితే ఈ సినిమా తో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని సంపత్ నంది చూస్తున్నట్టు గా తెలుస్తుంది… ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తె ఆయన రీసెంట్ గా చేసిన విరూపాక్ష,( Virupaksha )బ్రో రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడం తో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అయితే ఇదే టైం అనుకున్న సంపత్ నంది తొందర్లోనే తన సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు… అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే సంపత్ నంది ఒక మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటాడు…