UPDATES  

 కాంగ్రెస్ ను నమ్ముకుంటే.. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే

  • కాంగ్రెస్ ను నమ్ముకుంటే..
    కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే
  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • తెల్లంవెంకట్రావుకు గులాబీకండువా కప్పిన మంత్రి
  • భద్రాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం
  • భద్రాచలానికి శాశ్వత వరద నివారణ కరకట్ట నిర్మిస్తాం
  • రేగా కాంతారావు అధ్యక్షతన చేరికల సమావేశం
  • ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు గెలుస్తాం- మంత్రి పువ్వాడ, రేగా కాంతారావు
  • పొంగులేటికి షాకిచ్చిన బిఆర్ఎస్

(మన్యంన్యూస్ బ్యూరో, హైదరాబాద్, భద్రాద్రి)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ తగిలింది. నిన్నటి వరకూ ఆయన వర్గంలో ఉన్న తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో తెలంగాణభవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని వెంకట్ రావు కు త్వరగానే అర్థం అయిందన్నారు. అందుకే తిరిగి ఈ రోజు పార్టీలోకి వచ్చారన్నారు. వెంకట్రావు భవిష్యత్‌‌కు తమది బాధ్యత అని కేటీఆర్ అన్నారు. ఖమ్మం పక్కనే ఉన్న చత్తీస్‌గడ్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతున్నారన్నారు. ఎకరానికి పది క్వింటాళ్లు మాత్రమే చత్తీస్‌గడ్‌లో కొంటున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు. రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు నాలుగు వేలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేపు 25గంటల కరెంట్ ఇస్తామని అన్నా అంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారన్నారు. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వారు మనకు అవసరమా? ఎవరికి ఏం అన్యాయం చేశారని కేసీఆర్‌కు ఓటు వేయరు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాని ఇల్లు లేదు. కాంగ్రెస్ వాళ్లకు కూడా రైతు బంధు వస్తుంది.. తీసుకుంటున్నరు తిడుతున్నారు. భద్రాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం. భద్రాచలానికి శాశ్వత వరద నివారణకు కరకట్టల నిర్మాణం చేస్తాం. ఎవరెన్ని వాగినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్. కమ్యూనిస్టులు, నక్సలైట్లు కోరుకునే సమ సమాజ స్థాపన బీఆర్ఎస్ చేస్తోంది. కర్నూల్, రాయచూర్ నుంచి కూలి పని కోసం తెలంగాణకు వస్తున్నారు. గతంలో పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతోంది. కొందరు వచ్చి డబ్బులు ఇస్తాం అంటారు… కానీ ఓటు మాత్రం కేసీఆర్‌కే వేయండి. కేంద్రంలో మనం లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు. ఇక్కడి తీర్పు మహారాష్ట్రలో మలుపు కావాలి’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీటిసి పోశం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు బిఆర్ఎస్ గెలుస్తుందని ప్రభుత్వవిప్ రేగా కాంతారావు అన్నారు. ఇంకా ముందుముందు భారీచేరికలు జరగబోతున్నాయన్నారు.
………

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !