మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- కరోనా బారిన పడిన దగ్గర నుంచి మంచానికే పరిమితం అయిన భర్త ఒకవైపు, అప్పుల బాధ తాళలేని నిస్సహాయ స్థితి మరోవైపు ఎదురవడంతో ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన లకావత్ రజి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు వైద్య సహాయం నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం తోగురువారం మరణించింది. రజికి భర్త మోతిలాల్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.