మన్యం న్యూస్ చర్ల;
చర్ల మండల కేంద్రంలో ఇర్ప ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ కలివేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఉబ్బ ముత్తయ్య ఇంటిని వలస గిరిజనేతరు లైన పెద్దారపు శ్రీను,పెద్దాపురపుసుధ,శశి కుమార్, గంజి వెంకట్రావు, బ్రహ్మచారి సుమారు 50 మంది వచ్చి దౌర్జన్యంగా ఆదివాసి ఇంటిని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వలస గిరినేతులపైచట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అసలువలస గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ టి ఆర్ 1/70చట్టం ప్రకారం గా భూమి క్రయ విక్రయాలు జరుపుకునే హక్కు ఎక్కడిదనీ ప్రశ్నించారు. సిపిఎం పార్టీనీఅడ్డుపెట్టుకొని ఆదివాసీలపై ప్రత్యక్ష దాడులు, ఇళ్లను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని వలస గిరిజనేతరుల తాట తీస్తామని హెచ్చరించారు.ఈ విషయంపై భద్రాచలం ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకు పోతామని అన్నారు. ఈ సమావేశంలో ఏక నరసరావు కారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.