మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 17, మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ నందు మంజూరి అయిన నూతన సీసీ రోడ్డు పనులను ఎంపీపీ సోనీ, స్థానిక సర్పంచ్ రమాదేవి తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకర్ల గ్రామ పంచాయతీకి 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కృషి చేసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ చీమలపాటి బిక్షం, గ్రామ పెద్దలు ముత్తినేని రామయ్య, పంచాయతీ కార్యదర్శి నాని బాబు, గ్రామస్తులు పాతర్లపాటి వెంకయ్య, రాచబంటి కృష్ణారావు, చెరుకుమల్లి నవీన్, రావిచెట్టు రమేష్, సోబ్బని కోటేశ్వరరావు, కళ్యాణం గోపయ్య, ఉడత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.