UPDATES  

 తెలంగాణ ప్రజల బంధు సీఎం కేసీఆర్

  • తెలంగాణ ప్రజల బంధు సీఎం కేసీఆర్
  • కులవృత్తుల అభివృద్ధికి బిసి బంధు పథకం
  • కులవృత్తులకు బీసీబంధు బృహత్తర పథకం
  • బలహీన వర్గాలకు వందశాతం సబ్సిడీతో పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీబంధు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ప్రజల బంధు సీఎం కేసీఆర్ అనిఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన కళ్యాణలక్ష్మి, శాదీముబారక్, బీసీబంధు చెక్కులను ఆమెగురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఇల్లందు, ఇల్లందు టౌన్, టేకులపల్లి, కామేపల్లి మండలాల 200 మంది లబ్ధిదారులకు మంజూరైన బిసిబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కులవృత్తి చేసుకుని బతికేవారు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం తరుపున అందిస్తున్న సహాయమే బిసిబందు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంతమంచి పథకం లేదని, గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలలో కులవృత్తులు ఆదరణ కోల్పోయి దానిపై ఆదారపడిన వృత్తిదారులు పనిని వదిలేసి బతుకుతెరువుకు పట్టణాలకు వలసలు వెళ్ళారని తెలిపారు. వెనుకబడిన తరగతులలోని చేతివృత్తుల, కులవృత్తుల వారికి ఈ బిసిబందు ద్వారా లక్షరూపాయల సహాయం అందుతుందని, కులవృత్తుల వారికి బీసీబంధు ఒక బృహత్తర పథకమని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతమంచి ఆలోచన చేయలేదని, బలహీనవర్గాలకు నూరుశాతం సబ్సిడీతో పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. గత ప్రభుత్వాల హయంలో ఎవరైనా లబ్ధిదారులు స్వంతంగా వ్యాపారం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే 20శాతం సబ్సిడీతో మంజూరు కావడానికి చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, పైరవీలకే సగం డబ్బులు ఖర్చు అయ్యేవని మిగతా 80 శాతం వాటాకోసం బ్యాంకుల చుట్టూ సంవత్సరాలు తిరగాల్సిన పరిస్థితి ఉన్న తరుణంలో నేడు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్యే తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల ప్రజలకు ఇస్తున్న లక్ష రూపాయల పథకం మొత్తం సబ్సిడీనే అని, విడతలవారిగా ప్రతినెలా కొంతమంది లబ్ధిదారులకు బిసిబంధు చెక్కులు అందుతాయని నిరంతర కార్యక్రమమని ఎవ్వరూ నిరాశ చెందాల్సిన పని లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అందుతుందని అన్నారు. ఈ నగదు సహాయాన్ని లబ్దిదారులు వృదా చేయవద్దని, సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, సబ్సిడీఇళ్ళు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలందరికి గృహలక్ష్మి పథకంలో ఇళ్లను మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీడీ సీడీవో ఇందిరా, ఇల్లందు వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ రవికుమార్, మండల జెడ్పిటిసి వాంకుడోత్ ఉమాదేవి, ఎంపీపీలు బానోత్ సుజాత, చీమలనాగరత్నం, భూక్య రాధ, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, ప్యాక్స్ చైర్మన్ మెట్లకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు, మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్, నాయకులు బొమ్మెర్ల వరప్రసాద్, ధనియాకుల హనుమంతరావు, అధికారులు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !