UPDATES  

 వైద్యం వికటించి ఆదివాసి మహిళ మృతి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకి దిగిన బంధువులు

 

మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 17: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీ మహిళా మృతి చెందినట్టు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దమ్మపేట మండల కేంద్రంలో భవాని ప్రవేట్ ఆస్పత్రిలో కొద్ది రోజులు క్రితం కడుపు నొప్పి భాధతో వైద్యానికి వచ్చిన ఓ ఆదివాసి మహిళకు నిర్లక్ధ్యంగా వైద్యం చెయ్యడం కారణంగా ఆ మహిళా మృతి చెందినట్లు మృతురాలి బంధువులు మృతదేహంతో గురువారం ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని (25) అనే ఆదివాసీ మహిళా కడుపు నొప్పి బాధతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆమెకు కడుపులో గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని తెలియజేసి చేయాగ కొన్ని గంటలకే పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఖమ్మం ప్రవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు, అక్కడ వారు జాయిన్ చేసుకోక పోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ఫలితం లేకపోతే హైదరాబాద్ తరలించారు, అయితే హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సదరు మహిళ మృతి చెందింది. కాగా దమ్మపేట భవాని ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నందిని మృతి చెందినట్లు కుటుంబీకులు, ఆదివాసీలు మృతదేహంతో దమ్మపేట భవాని ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. అటు ఆదివాసి మహిళా మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీ సంఘాలు వారు డిమాండ్ చేసారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి మహిళా మృతికి కారణమైన వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేయడంతో ఆందోళన విరమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !