మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రామవరం ప్రాంతానికి గృహలక్ష్మి నిబంధనలు సడలించాలని మున్సిపల్ కమిషనర్ జి.రఘుకి సిపిఐ కౌన్సిలర్లు వినతి పత్రాన్ని గురువారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఏ పద్ధతిని అయితే అనుసరించి ఇచ్చారో అదే విధంగా రామవరం ప్రాంత ప్రజలకి రిజిస్ట్రేషన్ దస్తావేజు నిబంధన లేకుండా సొంత స్థలం ఉండి రేకులతో నిర్మాణం చేసుకొని గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని సిపిఐ కౌన్సిలర్లు కంచర్ల జములయ్య, భూక్య శ్రీనివాస్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు మున్సిపల్
కమిషనర్ ను కోరారు.