మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
చుంచుపల్లి మండల పరిధిలోని నందా తండా గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న గోధుమ వాగు వద్ద చెట్టుకి గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం ఇందుకు సంబంధించిన చుంచుపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గ్రామ పంచాయతీ చివరలో గల గోధుమ వాగులో ఒక చెట్టుకి గుర్తుతెలియని వ్యక్తి గేర్ వైరుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడు గత ఐదు రోజుల క్రితం ఉరి వేసుకొని ఉండవచ్చని తెలిపారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, స్కై బ్లూ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడని వివరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.