UPDATES  

 సరస్వతి పుత్రులను పని మనుషులుగా చూస్తారా?

సరస్వతి పుత్రులను పని మనుషులుగా చూస్తారా?
* విద్యార్థినిల సంక్షేమాన్ని గాలికి వదిలి పాచి పనులు చేయించడం సహించరానిది
* హెచ్ఎం వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేత భూపెందర్ డిమాండ్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీలతో వెట్టి చాకిరి చేయించడం సహించరాదని విద్యార్థినీలను పని మనుషులుగా చూస్తున్న హెచ్ఎం వార్డెన్లపై తక్షణమే ఉన్నంత అధికారుల చర్యలు తీసుకోవాలని
భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) భద్రాచలం డివిజన్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు డివిజన్ ఇంచార్జ్ యస్.భూపెందర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా హెచ్ఎం, వార్డెన్, సిబ్బంది ఇంట్లో విద్యార్థినిలచే రోజూ వంట ఊడ్చడం బట్టలు ఉతకడం వంటి పనులు కూడా చేయించడం దారుణం అన్నారు.
ఆరుగాలం కష్టపడి తల్లిదండ్రులు బిడ్డలను చదువుల కొరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు పంపిస్తే ఉపాధ్యాయ సిబ్బందే విద్యార్థినీలతో పనులు చేయించడం క్షమించరాని చర్య అన్నారు. తక్షణమే ఈ ఘటనపై అధికారులు తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినీలతో హెచ్ఎం, వార్డెన్ పనులు చేయిస్తున్నట్లు వైరల్ అవుతున్న ఫోటోలకు అధికారులు తగు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలను ఆశ్రమ పాఠశాలలోనికి అనుమతించకుండా విద్యార్థులతో పని మనుషులు చేసే పాచి పనులను చేయించడం బాధాకరమన్నారు. చిన్నపిల్లలతో పనులు చేయిస్తున్న వారిపై బాలకార్మిక చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూపెందర్ డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !