ఘనంగా పోతురాజు రవి జన్మదిన వేడుకలు
* విస్తృతంగా సేవా కార్యక్రమాలు
* పలు కుటుంబాలకు బియ్యం నిత్యావసరాల సరుకులు పంపిణీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు పోతురాజు రవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రవి జన్మదిన సందర్భంగా రవి అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఏరియా కొత్తగూడెం మున్సిపాలిటీ, లక్ష్మిదేవిపల్లి మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తలు రేగన్న యూత్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. 50 కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పోతురాజు రవి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు రేగన్న యూత్ సభ్యులు పలు ప్రాంతాల్లో కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు చేస్తున్న సేవలను తాను ఆదర్శంగా తీసుకొని పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యవసరాలను అందించడం జరిగిందన్నారు. ఇటు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అటు సేవే లక్ష్యంగా పనిచేస్తానని రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు రవి అభిమానులు పాల్గొన్నారు.