మన్యం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
2023- 24 విద్యాసంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో( జూనియర్ ఇంటర్) మిగిలిన కొన్ని సీట్ల భర్తీ కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఇటీవలే పదవ తరగతి 2022- 23 విద్యా సంవత్సరం పూర్తి అయిన అభ్యర్థులు తప్పకుండా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 21వ తేదీ సోమవారం నాడు బాల బాలికలకు ఉదయం 9 గంటలకు స్పాట్ కౌన్సిలింగ్ వైటిసి ఇల్లెందు వద్ద స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని ఇట్టి సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇతర సమాచారం కొరకు అరుణ కుమారి ప్రిన్సిపాల్ 965 2949 784, బి.హారి కృష్ణ ప్రిన్సిపాల్ 94930 11 065, వి అనసూర్య వైటిసి ఇంచార్జ్ 8106 141 505 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి ఖమ్మం రీజియన్ డేవిడ్ రాజ్ తెలిపారు.