మన్యం న్యూస్ చర్ల:
పత్రికేయులు సమాజసేవకు అనునిత్యం పాటుపడాలని ఎస్ఐలు టి ఆర్ సూరి,నర్సిరెడ్డి లు అన్నారు.శుక్రవారం చర్ల పోలీస్ స్టేషన్లో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ మహాసభ బ్రోచర్ ని వారు ఆవిష్కరించి జరిగింది.ఆగస్టు 27న చర్ల మండల కేంద్రంగా జరిగే టీ డబ్ల్యూ జె ఎఫ్ డివిజన్ మహాసభ ను నిర్వాహకులు నిరంతరాయంగా నిర్వహించాలని వారు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, జి వెంకటేశ్వర్లు పాత్రికేయులు అందరూ సంఘటితంగా ఉంటూ తమ తమ న్యాయమైన డిమాండ్ల కోసం అనునిత్యం పాటుపడాలని కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు పొందడానికి పాత్రికేయులు సమిష్టిగా కృషి చేయాలని వారు తెలిపారు. చక్కని సమన్వయంతో ఈనెల 27న జరిగే భద్రాచలం డివిజన్ మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. పాత్రికేయుల సమస్యల పట్ల టియుడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి నేతృత్వంలో అలుపెరగని పోరాటాలు చేయడానికి టియుడబ్ల్యూజేఎఫ్ అనునిత్యం కృషి చేస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న కోశాధికారి దొడ్డి హరి నాగ వర్మ, ఉపాధ్యక్షులు తోట మల్ల రమణమూర్తి అన్నారు. జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విలేకర్ల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించేలాగా టిడబ్ల్యూజేఎఫ్ పోరాటాలు చేసిందని వారు గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల విషయమై మునుముందు పోరాటాలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టిడబ్ల్యూజేఎఫ్ పిలుపునిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులు పి.మైబు, ఆలం సతీష్, తోటమల్ల కృష్ణారావు, కొంగూరు సత్యం,ఎడెల్లి గణపతి తదితరులు ఉన్నారు.