UPDATES  

 మీ సేవ కేంద్రాలపై ఫిర్యాదు చేసిన చర్యలేవి ?

  • మీ సేవ కేంద్రాలపై ఫిర్యాదు చేసిన చర్యలేవి ?
  • మండల కేంద్రంలో ఉన్న రెండు మీ సేవలో నిర్వాహకుల నిర్లక్ష్యం….
  • దళితబంధు, గృహలక్ష్మి పథకాల కోసం కులం, ఆదాయం
  • ధ్రువపత్రాల దరఖాస్తులు తీసుకోకుండా నిర్లక్ష్య సమాధానం..
  • రెండు మీసేవ ల తీరు అంతే!
  • గతంలో కూడా మీ సేవ కేంద్రాలపై ఫిర్యాదు చేసిన చర్యలేవి ?
    జిల్లా బాస్ దృష్టి సారించాలంటున్న మండల ప్రజలు

మన్యం న్యూస్ ,చండ్రుగొండ ఆగస్టు 18 : మండల కేంద్రంలో రెండు మీ సేవలో నిర్వాకులు వీరభద్రం, కుక్కడపు నరేష్ లు దళితబంధు, గృహలక్ష్మి పథకాల కోసం కులం, ఆదాయం ధ్రువపత్రాల దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లగా దరఖాస్తు దారులకు నిర్లక్ష్య సమాధానం ఎదురవుతుంది. మండలంలోని రెండు మీసేవలలో వ్పరిస్థితి ఇలానే ఉందని ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు . మీ సేవలో ఆగడాలపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.మండల ప్రజలు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .బాధితుడు పెంబుల లక్ష్మణ్ కథనం మేరకుచండ్రుగొండ గ్రామపంచాయతీ, శ్రీనగర్ కాలనీ కి చెందిన పెంబుల లక్ష్మణ్ s/o నాగయ్య శుక్రవారం దళితిబంధు పథకం కోసం కులం, ఆదాయం ధ్రువపత్రాల దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లగా మీసేవ నిర్వాకుడు వీరభద్రం దరఖాస్తు తీసుకోను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు సోమవారం రా అని నిర్లక్ష్య సమాధానం చెప్పినాడు. అలాగని రెండవ మీసేవ నిర్వాకుడు కుక్కడపు నరేష్ దగ్గరికి వెళ్ళగా దరఖాస్తు చూడకుండా,విషయం చెప్పకుండా ముందుగానే నువ్వు బయటికి వెళ్ళు అని నిర్లక్ష్య సమాధానం చెప్పినాడు. . నేను నిరుద్యోగిని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కొరకు కులం, ఆదాయం ధ్రువపత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్ళగా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న నిర్వాహకులను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.
తహసిల్దార్ వివరణ
మీసేవ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండల తహసిల్దార్ సాజీయా సుల్తానా ను మన్యం న్యూస్ ప్రతినిధి వివరణ అడగగా… దళితబంధు, గృహలక్ష్మి దరఖాస్తుదారులు మీసేవ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నా దృష్టికి వచ్చిందని, దీనిపై ఆర్.ఐ ను పంపించి విషయం తెలుసుకుంటానన్నారు. దరఖాస్తు దారులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తాసిల్దార్ అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !