UPDATES  

 గడపగడపకూ కాంగ్రెస్ ప్రచారం చేపట్టిన జెడ్పీచైర్మన్ కోరం

 

మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణా ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఐదవవార్డు లో శుక్రవారం గడపడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా పట్టణంలోని జేకే కాలనీలో గల హరిహర క్షేత్రంలో తొలుతగా ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గడపగడకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరం కనకయ్యకు స్థానిక మహిళలుఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఆడబిడ్డలకు ఐదువందల రూపాయలకే వంట గ్యాస్, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదులక్షల రూపాయలతో ఉచితవైద్యం, సొంతింటి కల సాకారానికి ఐదులక్షల రూపాయలు, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే నెలకు ఐదువేల రూపాయల ఫింక్షన్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత కార్మికులు, డయాలసిస్, ఎయీడ్స్, పైలెరియా బాధితులకు నెలకు నాలుగువేల రూపాయల ఫింక్షన్ వంటి పధకాలను ప్రచారంలో భాగంగా గడపగడపకూ వెళ్ళిన కోరం ప్రజలకు వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, మండల అధ్యక్షులు పులి సైదులు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మైనారిటీ అధ్యక్షులు మసూద్, మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీను, బీసీసెల్ అధ్యక్షులు శంకర్, ఎస్టీసెల్ అధ్యక్షులు వీరూ, సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, జీవీ భద్రం, ఐజాక్, చిన్నా శ్రీను, వెంకటనారాయణ, మహబూబ్, సైదేమియా, మున్నా, రెడ్డి, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !