*పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగాసర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు
* రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి పట్టిన వీరుడు సర్వాయిపాపన్న గౌడ్:ముత్యం బాబు గౌడ్
మన్యం న్యూస్,మణుగూరు: మండల వ్యాప్తంగా బహుజన వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మణుగూరు మండల కూనవరం పంచాయతీ లో సర్దార్ సర్వాయి. పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి సర్పంచ్ ఏనిక. ప్రసాద్, ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు లు పూలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తుల ఆగడా లకు వ్యతిరేకం గా పోరాడి వరంగల్ ఖిల్లా, భువనగిరి కోట, గోల్కొండ ఖిల్లా ను ఆక్రమించుకొని, బానిసత్వ బ్రతుకులు పారద్రోలి మంచి సు పరిపాలన కొనసాగించిన గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం నకు పాపన్న గౌడ్ ను కూడ ఆదర్శం గా తీసుకోవడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి సంధ్యా రాణి, వార్డ్ మెంబెర్ కలగూర. శంకర్, మాజి ఎం పి టి సి వల్లభనేని. రమణ, గిరిజన మత్స శాఖ సహకార సంఘం అధ్యక్షులు వంక. అర్జున్ రావు బి ఆర్ యస్ పార్టీ నాయకుడు మహమ్మద్. మూసా మరియు స్థానికులు పాల్గొన్నారు.
రామనుజవరం లో…
బహుజన వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్373 వ జయంతి వేడుకలను రామనుజవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు మేకపోతుల నర్సింహారావుశుక్రవారం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
మణుగూరు లో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ శోభ యాత్ర సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 373 జయంతి సందర్భంగా మణుగూరు మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభ యాత్ర నిర్వహించారు.మణుగూరు సురక్ష బస్ స్టాండ్ నుండి ప్రారంభమైన ఈ శోభ యాత్ర అంబెడ్కర్ సెంటర్ వరకు కొనసాగింది. బహుజన ఐక్యత వర్ధిల్లాలి అని ,జోహార్ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్, గౌడ్స్ ఐక్యత వర్ధిల్లాలి అని నినదించారు. అనంతరం డా.బీ. ఆర్.అంబెడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మండల నాయకులు ముత్యం బాబు గౌడ్ మాట్లాడుతూ…
రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి పట్టిన వీరుడతను. దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. గౌడ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పల్లి యాదగిరి గౌడ్,దొంతగాని కరుణాకర్ గౌడ్,పూజారి రవి గౌడ్, బసవ సరస్వతి, చిర్ర శ్రీనివాస్ గౌడ్,చిర్ర రవి గౌడ్ చిర్ర కృష్ణ గౌడ్,దామోదర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.