మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
కంచర్ల చేత ఎమ్మెల్యే వనమా కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల సాంబశివరావు, కరుణాకర్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, తులసి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపు, కౌన్సిలర్లు, ఎంపీటీసీల జిల్లా సంఘం అధ్యక్షురాలు కొల్లు పద్మ, సర్పంచ్ సంగం జిల్లా అధ్యక్షులు బలరాం నాయక్, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.