*ములకలపల్లి సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
*భారి మెజార్టీతో ఎమ్మెల్యే మెచ్చా ను గెలిపించుకుంటాం – బీ. ఆర్ ఎస్ పార్టీ మండల కార్యకర్తలు
మన్యం న్యూస్,ములకలపల్లి(ఆగష్టు 19.)మండల కేంద్రంలో రూ5కోట్ల రూపాయలతొ సెంట్రల్ లైటింగ్ పనులను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు.అనంతరం హమాలిలు నిర్మించుకున్న హమాలి సంఘం కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు మాట్లాడుతూ ఎన్నడు లేని అభివృద్ది అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధిచేపట్టడం జరిగిందని,ఏ గ్రామానికి వెళ్లిన తారు రోడ్లు,సీసీ రోడ్లు కనిపిస్తున్నాయని,మిగిలిన రోడ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఎదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందని, మళ్ళీ కె సి ఆర్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు. అనంతరం నలీయ్ వారి గూడెం గ్రామంలో శ్రీకాంత్ వివాహ వేడుకలో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపిపి మట్ల నాగమణి,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షలు మొరంపూడి అప్పారావు, సిపిఐ రాష్ట్ర కార్యక్రమం వర్గ సభ్యులు నరాటి ప్రసాద్, ఎంపిటిసి మెహర్రమని,అధికారులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
