UPDATES  

 అంజనేయ స్వామి, ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు

అంజనేయ స్వామి, ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు

మన్యం న్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండలం కొయ్యగూడెం గ్రామపంచాయతీ హనుమతండా గ్రామంలో శనివారం జరిగిన అభయంజనేయస్వామి, ముత్యాలమ్మ తల్లి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ ,హరిసింగ్ నాయక్ దంపతులు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమతండా గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..శ్రావణమాసంలో
ఆంజనేయస్వామి, ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్రహప్రతిష్టలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ దేవుడు నాకు కలిగించిన అదృష్టం ఆశీస్సులుగా భావించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దేవుడి ఆశీస్సులుతో ఈ గ్రామంలోని రైతులు, ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెంది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. దైవ అనుగ్రహంతో రాష్ట్రం, ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే హరిప్రియ వ్యాఖ్యానించారు. గ్రామప్రజల రవాణా సౌకర్యం కొరకు హనుమతండా నుంచి కొయ్యగూడెం హాస్టల్ వరకు ఒకకోటి రూపాయలతో బిటిరోడ్డు మంజూరు అయిందన్నారు. అనంతరం హనుమతండా గ్రామంలోని దేవాలయానికి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులు 50 వేల 116 రూపాయలు, కొయ్యగూడెం స్థానిక మండల నాయకులు చీమల సత్యనారాయణ 20వేల 116 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడబాలు నాయక్, జిల్లా నాయకులు బానోత్ రామానాయక్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్, నాయకులు బర్మావత్ లాల్ సింగ్ ,దళపతి శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !