పివి కుటుంబానికి యుటిఎఫ్ అండగా ఉంటుంది
మన్యం న్యూస్,భద్రాచలం:
భద్రాచలం
విద్యార్థి యువజన ఉద్యమ నాయకుడు పీవీ శ్రీనివాస్ చిత్రపటానికి యుటిఎఫ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు బి రాజు మాట్లాడుతూ వామపక్ష భావజాలంతో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పివి శ్రీనివాస్ మృతి చాలా బాధాకరమని అన్నారు.
పీవీ శ్రీనివాస్ కుటుంబానికి యుటిఎఫ్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తాను ప్రజాసేవలో ఉంటూ కూడా తన భార్య స్వర్ణ జ్యోతిని ఉపాధ్యాయ రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు పోరాట బాట లో పయనించే విధంగా ఆమెను ఎంతగానో పీవీ శ్రీనివాస్ ప్రోత్సహించారని ఈ గుర్తు చేశారు. పివి శ్రీనివాస్ తల్లితండ్రులను భార్య స్వర్ణ జ్యోతిని యుటిఎఫ్ నాయకులు ఓదార్చే కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు .ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రాజ, శ్రీనివాస్, విజయ్, సత్యనారాయణ ,ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.