UPDATES  

 సగం ధరకే ట్రాక్టర్లను అందించిన ఆర్ఏడిఎస్ సంస్థ

  • సగం ధరకే ట్రాక్టర్లను అందించిన ఆర్ఏడిఎస్ సంస్థ
  • మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి -చైర్మన్ గజ్జల విగ్నేష్

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 19: గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం ఆర్ఏడిఎస్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు సగం ధరకే లభించిన ట్రాక్టర్లను ఆ సంస్థ చైర్మన్ గజ్జల విగ్నేష్, మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ రాజు చేతుల మీదుగా రైతులకు శనివారం అందజేశారు. అశ్వారావుపేట జంగారెడ్డిగూడెం రోడ్డులోని గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం కార్యాలయం వద్ద మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కిసాన్ పరివార్ ఫౌండేషన్ హైదరాబాద్ నేతృత్వంలో కొత్తగూడెం రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలంలో సభ్యత్వం పొందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఇప్పటికే మండల రైతాంగానికి రోటావేటర్లు, కల్టివేటర్లు, డబుల్ బ్యాటరీ స్ప్రేయర్లు అందజేశామని, త్వరలో దరఖాస్తు చేసుకున్న రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేయనున్నామని, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలో ట్రాక్టర్లకు దరఖాస్తు చేసుకున్న తిరుమల కుంటకు చెందిన పొట్ట వెంకటేశ్వరరావు, దమ్మపేట మండలం పార్కలగండి కు చెందిన కాకా రాజు లకు 50 శాతం సబ్సిడీపై నమోదు చేయించుకున్న సమయంలో ఏడులక్షల యాభై వేలు ఉన్న ట్రాక్టర్ రూ .3 లక్షల 75 వేలకు డిపాజిట్ చేయించడం జరిగిందని,వారికి ట్రాక్టర్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ట్రాక్టర్ల కోసం మరికొంతమంది రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వారికి కూడా త్వరలోనే ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై అందజేస్తామని, సభ్యత్వం కలిగిన రైతులు వారి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలని, ఆర్ఏడిఎస్ సంస్థ రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతుందని, భవిష్యత్తులో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి సంస్థ వడివడిగా ముందుకు అడుగులు వేస్తుందని, 11 కోట్ల రూపాయలతో సిఎన్జి గ్యాస్ సంస్థ నెలకొల్పబోతున్నామని, దానివలన రైతాంగానికి నిరంతర ఆదాయ మార్గాలు ఏర్పడతాయని మండల రైతాంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సమావేశ అనంతరం రైతాంగానికి 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏడిఎస్ మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, సీఈవో సుబ్బారావు మండల నలుమూలల నుండి రైతులు, ఆర్ఎడిఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !