UPDATES  

 సీఐ ,ఎస్సై ల పైఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

మన్యం న్యూస్, భద్రాచలం:
ఆదివాసి కాంగ్రెస్ తెలంగాణ కమిటీ ఆదేశాల మేరకు భద్రాచలం పిఓ ఐటిడిఏ పి ఓ కికాంగ్రెస్ పార్టీ ఆదివాసి కొత్తగూడెం జిల్లా కమిటీ వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ ఉబ్బా వేణుబాబు మాట్లాడుతూ.. ఆగస్టు 15న 77వ స్వతంత్ర దినోత్సవం రోజున రాత్రి హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గిరిజన మహిళపై పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలకు గురిచేసి థర్డ్డ డిగ్రీ ఉపయోగించి ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీసులు చేసిన నిర్వాహకాన్ని ఆదివాసి కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు.యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఒక మణిపూర్ తరహాలో హైదరాబాద్ నడి ఒడ్డున పోలీసులు ఈ దారుణానికి ఒడి కట్టడం ఎంతవరకు సబాబు అని ప్రశ్నించారు. ఆదివాసి గిరిజన మహిళ అయినటువంటి లక్ష్మి పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ… ఈ దాడికి సంబంధించిన పోలీసులు ఎల్బీనగర్ స్టేషన్ సీఐ,ఎస్సై ల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మహిళా చట్టాలు అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి ప్ర,భుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ ఉబ్బా వేణుబాబు.నాయకులు కే విజయ్ కుమార్, ఎస్టీ సెల్ భద్రాచలం మండల్ కన్వీనర్. యూత్ కాంగ్రెస్ దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కోడి చంటిబాబు, భద్రాచలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి.సతీష్, ఎస్సీ సెల్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, సాగర్, వెంకటేష్, భాస్కర రావు, రవి, కే వేణుబాబు, కే ఏసుబాబు, గోపి, కే వీర్రాజు, జానకి, వీరమ్మ, దుర్గ భవాని, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !