UPDATES  

 విజయవంతం గా ఐ ఓట్ ఫర్ స్యూర్ 5కే రన్

విజయవంతం గా ఐ ఓట్ ఫర్ స్యూర్ 5కే రన్
*ఓటింగ్ పై విస్తృత ప్రచారం
*డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోవద్దు
*ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది
*18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కు దరఖాస్తు చేసుకోవాలి
*తహశీల్దార్ రవి కుమార్
మన్యం న్యూస్,ఇల్లందు
ఓటింగ్ పై విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఐ ఓట్ ఫర్ స్యూర్ అనే నినాదంతోజిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాల మేరకు 5కే రన్ తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పట్టణంలో నిర్వహించడం జరిగింది. పట్టణంలో గల గోవింద్ సెంటర్ నుంచి ప్రారంభమైన 5కే రన్ లో ఉన్నతాధికారులతో కలిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందు వరుసలో ఉండి 5కే రన్ ను విజయవంతంగా కొనసాగిస్తూ ఓటరు ఆవశ్యకతపై స్లొగన్స్ ఇస్తూ సుదిమల్ల క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వరకు పాల్గొని 5కే రన్ ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రవి కుమార్ మాట్లాడుతూ…ప్రజలకు ఓటు పై అవగాహన కోసం 5కే రన్ నిర్వహించినట్లు తెలిపారు.
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుందన్నారు. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని,
ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు.ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ 5కే రన్ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, వివిధశాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ఎస్ఎస్ విభాగం బాధ్యులు డాక్టర్ సిహెచ్. రమేష్, విద్యార్థులు, ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !