వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
*ఇంటి స్థలాలు ఇచ్చేదాకా ఇంచు కూడా కదిలేది లేదు
*ప్రజాపంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ చరణ్
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 117 లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని వరద బాధితులకు ఇళ్ల స్థలాల కై కేటాయించాలని వరద బాధితుల పోరాట సంఘం ఆధ్వర్యంలో వందలాదిమంది ముంపు ప్రజలు శనివారంగుడిసెలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితుల పోరాట సంఘం అధ్యక్షుడు కొండాచరణ్ మాట్లాడుతూ మొగుళ్లపల్లి, గొంపల్లి, లింగాపురం, కొత్తపల్లి, తేగడ, గొమ్ముగూడెం, పంచాయతీలలో గ్రామాల లోని ప్రజలు ప్రతీ సంవత్సరం ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నారని వారికి శాశ్వత పరిష్కారంగా మెరక ప్రాంతంలో ఇంటిస్థలాలు ఇవ్వాలని పలు దఫాలుగా అధికారులను కోరామని అన్నారు. ఐనప్పటికీఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నాయి తప్ప ఉపయోగం ఏమి లేదని కనీసం సర్వే కూడా చేయడంలేదని అన్నారు. వరద బాధితులు అంటే ఎందుకు ఇంత చులకన అని ప్రశ్నించారు. నిరుపయోగంగా ఖాళీలిగా ఉన్న సర్వేనంబర్ 117 లోని ప్రభుత్వ భూమిని వెంటనే వరదబాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చేవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని ముంపు సమస్య నుంచి బాధితులను శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వరద బాధితుల పోరాట సంఘం అధ్యక్షులు బోడా సందీప్, కార్యదర్శి కొండా కౌశిక్, సహాయ కార్యదర్శి పాలెం చుక్కయ్య, ఉపాధ్యక్షులు పురిటి ప్రశాంత్, ఉపాధ్యక్షులు గుమ్ముల సర్వేశ్,ఉపాధ్యక్షులు నాగరత్నం, సభ్యులు బాలరాజు, ముంపు గ్రామస్థులు పాల్గొన్నారు.