మన్యం న్యూస్ గుండాల: పోరాటాల ఘన చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం మండల మహాసభను నిర్వహించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ సాయుధ పోరాటం లోను, విద్యారంగ సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఏఐఎస్ఎఫ్ దిఅని అన్నారు. విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడే నాయకులకు విద్యార్థి లోకం అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
