UPDATES  

 సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి …?

సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈమె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్‌.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది.

 

వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఈ యాడ్ లో పట్టు వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించి పెళ్లి కూతురులా త్రిష మెరిసిపోయింది. రాయల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల పడుచుపిల్లాలా అలరించింది. దీంతో ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ యాడ్ చూసి రియల్ లైఫ్ లో పెళ్లెప్పుడు చేసుకుంటావ్ త్రిష అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 

కాగా, గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న త్రిష.. పొన్నియిన్ సెల్వన్ తో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన నటనతో అలరించింది. ఈ మూవీ తర్వాత త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దళపతి విజయ్ సరసన `లియో` మూవీలో నటిస్తోంది.తమిళంలోనే ది రోడ్, సతురంగ వెట్టై 2 వంటి సినిమాలు చేస్తోంది. మరోవైపు మలయాళంలోనూ పలు ప్రాజెక్ట్ లను టేకప్ చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !