జననేత రేగకు అడుగడుగున ప్రజల బ్రహ్మరథం.
* అడుగడుగునా పూలు వెదజల్లుతూ అభిమాన నాయకుడు రేగా కుఘన స్వాగతం పలికిన మహిళలు, ప్రజలు
మన్యం న్యూస్ ,కరకగూడెం: మండలంలోని గొడుగు బండ గ్రామం వద్ద వట్టివాగుపై నిర్మాణం చేపట్టనున్న చెరువు పనులకు, తాటిగూడెం, పాపాయిగూడెం, బుర్దారం పోలకమ్మతోగు, కరకగూడెం గ్రామాలలోని బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం విచ్చేశారు. ఈ నేపథ్యంలోఆయా గ్రామాల ప్రజలు మహిళలు తమ అభిమాన నాయకున్ని మంగళ హారతులతో, యువతపూ అడుగడుగునా తూ పూలమాలలు,బొకేలు అందిస్తూ పూలు వెదజల్లుతూ ఘన స్వాగతం పలికారు.
